- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సీఎం కేసీఆర్ పర్యటనపై మంత్రుల సమీక్ష..
దిశ, తెలంగాణ బ్యూరో: సంక్షేమ, అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు సీఎం జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 20న జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. అందులో భాగంగా గురువారం హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్వార్టర్ లో సీఎం పర్యటనపై వరంగల్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన సందర్భంగా చేపట్టే సంక్షేమ, అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. అన్ని పనులు సమన్వయంతో చేయాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి పనులు వాటి కార్యాచరణ, ప్రస్తుతం సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎడవెల్లి కృష్ణ రెడ్డి, నాయకులు సంపత్, రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.