- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రయోగాత్మకంగా ఎస్సీలకు మినీ డెయిరీలు
దిశ ప్రతినిధి, వరంగల్: పాల ఉత్పత్తితో ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ రూరల్ కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ పైలట్ ప్రాజెక్టు కింద మినీ డెయిరీలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలోని 610 మంది లబ్ధిదారులకు మినీ డెయిరీల కింద రూ.22.40 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాల ఉత్పత్తిలో మనదేశం అగ్రగామిగా ఉందన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పాల ఉత్పత్తి ఇక్కడే జరగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఎస్సీలకు మినీ డెయిరీలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సదానందం, జిల్లా కలెక్టర్ హరిత, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు పాల్గొన్నారు.