- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నో గొప్ప పనులు త్వరలో జరగనున్నాయి: వేముల
దిశ, నిజామాబాద్: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేడు ప్రతిపక్షాల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాస్తవాలేందో మీ కళ్ల ముందే ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు జరగనున్నాయని అన్నారు. వివరాల్లోకి వెళితే.. శనివారం ఆయన బాల్కొండ నియోజకవర్గం కొత్తపల్లి, పచ్చలనడ్కుడ గ్రామాల సమీపంలో పెద్దవాగులో నూతనంగా నిర్మించనున్న చెక్‌డ్యాంల ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో తొలివిడతగా ఈ వాగుల్లో మూడు చెక్‌డ్యామ్‌లు నిర్మించామని, వాటి సత్ఫలితాలు కనిపించడంతో విడతల వారీగా మరో ఆరు చెక్‌డ్యాంలు మంజూరు చేయించామన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో 10 చెక్‌డ్యాంలు మంజూరు చేయించి వీటిని రూ. 60 కోట్లతో పూర్తి చేయనున్నామని మంత్రి తెలిపారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పునర్జీవం పథకం ద్వారా నింపి చూపిసస్తామని, ప్రతిపక్షాల ఊహకు కూడా అందని ఎన్నో గొప్ప పనులు త్వరలో జరగనున్నాయని, పునర్జీవం పథకం ద్వారా నీళ్లు రావని సంబరపడ్డ ప్రతిపక్షాల నాయకులు వరద కాలువ ద్వారా కాళేశ్వరం జలాలు ఎగువకు ప్రవహిస్తుండటం చూసి నోటి మాట రాకుండా ఉండిపోయారన్నారు. రైతుల కోసం పరితపించిన మా తండ్రి వేముల సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం తన స్వగ్రామం వేల్పూర్‌లో ప్రభుత్వం సమకూర్చిన భూమిలో నా సొంత ఖర్చులతో రైతువేదికను నిర్మించి ఇవ్వబోతున్నానని.. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నాని మంత్రి తెలిపారు. మంత్రి వెంట కార్యక్రమంలో ఎంపీపీ బీమా జమున, జెడ్పీటీసీ అల్లకొండ భారతి, డీసీసీబీ వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డి, వేల్పూర్ సర్పంచ్ పిట్ల సత్యం, ఆర్టీఏ సభ్యుడు రేగుల రాములు ఉన్నారు.