- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నిబంధనలు కఠినంగా అమలు చేయగలిగితే గ్రీన్‌జోన్’
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కోవిడ్-19 నియంత్రణ విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయగలిగితే ఆరెంజ్ జోన్‌లో ఉన్న నిజామాబాద్ గ్రీన్‌జోన్‌లోకి వస్తుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఛాంబర్‌లో కోవిడ్-19, ధాన్యం కొనుగోళ్లు, ఎరువులపై కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, ఇతర అధికారులతో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. హై రిస్క్ ఉన్నవారిని గుర్తించి బయటకి రాకుండా అవగాహన కల్పించాలన్నారు. బీపీ షుగర్ ఉన్న వారికి మందులు ఇబ్బంది కాకుండా మెడికల్ ఆఫీసర్‌లు, ఆశా వర్కర్లు ఐడెంటిఫై చేసి మందులు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 61 పాజిటివ్ కేసులు కాగా ప్రస్తుతం ఐదుగురు మాత్రమే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. మహారాష్ర్ట నుంచి వచ్చిన వారిని ఖచ్చితంగా హోం క్వారంటైన్‌లో ఉంచాలన్నారు. మున్సిపల్ అధికారుల ఆదేశాల ప్రకారం నిబంధనలు పాటించాలని, తప్పనిసరి మాస్కులు ధరించాలని కోరారు.