‘కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావు’

by Shyam |
‘కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 67.04 శాతం ఓటింగ్ జరిగినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఎన్నిక పోలింగ్ ఏకపక్షంగా జరుగుతోందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. నిజామాబాద్‌కు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని ఎమ్మెల్యే గుప్తా అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story