చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తి, భయం లేవు..

by srinivas |
చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తి, భయం లేవు..
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు దేవుళ్లపై భయం, భక్తి లేదని మండిపడ్డారు. రామతీర్థంలో మొసలి కన్నీరు కారుస్తూ.. ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు జీరో అయిపోయారని, దిగజారి అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై బుదరజల్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అద్భుతమైన పథకాలతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని వెల్లడించారు. మొన్నటి వరకూ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేసిన చంద్రబాబు, ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో ఆలయాలు కూల్చిన దుర్మార్గుడే చంద్రబాబు అని, నాడు అడ్డగోలుగా కూల్చి ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా అసలు హిందూత్వం అంటే చంద్రబాబు తెలుసా అని ప్రశ్నించారు. బూట్లు తీయకుండా పూజలు చేసే సంస్కృతి చంద్రబాబుది అని అన్నారు.

Advertisement

Next Story