- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు అధిక ప్రాధాన్యం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
దిశ, మహబూబ్‌నగర్: దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులు పండించిన ప్రతి గింజనూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తమ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి మంగళవారం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని చెప్పారు. దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది రాకుండా గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వాలు రైతులను ఏమాత్రం పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని మంత్రి పేర్కొన్నారు.
Tags: Mahabubnagar,Minister v.srinivasgoud,crop purchase center