- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నింబోలి అడ్డా అనాథ ఆశ్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనాథ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నింబోలి అడ్డాలోని అనాథ బాలికల వసతి గృహాన్ని అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో కలిసి సందర్శించారు. వసతి గృహంలోని వసతులు, తరగతి గదులను పరిశీలించారు. అక్కడ ఉంటున్న విద్యార్థులకు అందుతున్న భోజన, తదితర వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉన్న అనాథ పిల్లలకు, కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలిచి వారిని ఆదుకోవాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అనాథ పిల్లలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ, సహకారాలు అవసరమో గుర్తించడానికి, సమస్యలపై అధ్యయనం చేయడానికి సీఎం కేసీఆర్ 8 మంది మంత్రులతో ఒక మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారని తెలిపారు. అనాథ పిల్లలకు ప్రభుత్వం తల్లిదండ్రుల వలె అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ఇప్పటికే వివిధ ఆశ్రమాలలో ఉన్న అనాథలకు ఎంతో నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో వసతి, విద్యను అందిస్తున్నట్లు వివరించారు. అనాథ పిల్లల కోసం చేపట్టవలసిన చర్యలపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని మంత్రి వెల్లడించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలెజ , కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్, వసతి గృహం ఇన్‌చార్జీ గౌతమి తదితరులు పాల్గొన్నారు.