మంత్రి గారు… మీకు కృతజ్ఞతలు

by Shyam |
మంత్రి గారు… మీకు కృతజ్ఞతలు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని తన కార్యాలయం నుండి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని సీనియర్ సిటిజన్స్ తో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతుందని, దాని బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వచ్చిన వారు కూడా ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, దైర్యంగా ఉండాలని అన్నారు. అత్యవసరం అయితే తప్ప ఇండ్లలో నుండి బయటకు రావద్దన్నారు. కరోనా లక్షణాలు ఉంటే తప్ప టెస్ట్ ల కోసం ఆసుపత్రులకు వెళ్ళవద్దని అన్నారు. నియోజకవర్గ పరిధిలో కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులేనని, ఏ సమయంలోనైనా తనతో పాటు తన కార్యాలయానికి కాని ఫోన్ చేసి సమస్యను తెలపాలని అన్నారు. ఈ సందర్బంగా పలువురు సేనియర్ సిటిజెన్స్ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో అనేక మంది పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ఆదుకున్నారని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా భయంతో వణికిపోతున్న సీనియర్ సిటిజన్స్ కు టెలి కాన్ఫరెన్సు ద్వారా ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా ఫోన్ లో మాట్లాడి ఎంతో దైర్యాన్ని కల్పించారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు పలువురు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed