- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధం : తలసాని
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ‘గంగ పుత్రులు మనోభావాలు కించపరిచేలా నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు, ఒకవేళ వారి మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడాను అనిపిస్తే క్షమాపణలు చెప్పేందుకు నేను సిద్ధ’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇటీవల కోకాపేటలో జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో తాను గంగపుత్రులను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన వ్యాఖ్యలు ఏమైనా తప్పుగా ఉన్నాయని భావిస్తే గంగపుత్రులకు క్షమాపణలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి గంగపుత్రుల సంక్షేమం, అభివృద్ధి పట్టించుకున్న వారు లేరని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ గంగ పుత్రులకు చెరువులు, కుంటలు మీద సర్వాధికారాలు కల్పించి, లాభం చేకూర్చారని అన్నారు. ఇలాంటి అంశాలను మాత్రమే నేను ప్రస్తావించాను అని వెల్లడించారు. గంగపుత్రుల పట్ల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, వెంటనే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని అఖిల భారత గంగపుత్ర సంఘం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి ఇవాళ మంత్రి స్పందించారు.