పుట్టిన రోజు సందర్భంగా మొక్క నాటిన తలసాని

by Shyam |
పుట్టిన రోజు సందర్భంగా మొక్క నాటిన తలసాని
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మంత్రి నివాసంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు ఆకుపచ్చ తెలంగాణ కావాలన్న ఆలోచనతో, ఎంపీ సంతోష్ కుమార్ చాలెంజ్ స్వీకరించి మొక్క నాటామన్నారు.

కరోనా వ్యాధి ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గనందున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా ఎలాంటి వేడుకలు చేయరాదని సూచించామని తెలిపారు. కేవలం రోగులకు, పేదలకు పండ్లు, బట్టల పంపిణీ వంటివి మాత్రమే పార్టీ శ్రేణులు అందజేశారని పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి, తన పుట్టినరోజున మొక్క నాటేలా చేసిన సంతోష్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story