ఐదో ‘షో’కు ఓకే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి తలసాని

by Shyam |
Minister Talasani Srinivas Yadav
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్‌కే భవన్‌లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఫిల్మ్ ఛాంబర్ సభ్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… సినిమా షూటింగ్‌ల కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో థియేటర్‌లు మూసి వేసినందున విద్యుత్ చార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు తదితర విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందజేశామన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వచ్చే సమావేశంలో తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు. 5వ ఆట ప్రదర్శనకు కూడా అనుమతించడం జరిగిందని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed