ప్రజలకు అందుబాటులో ఉండాలి

by Shyam |
ప్రజలకు అందుబాటులో ఉండాలి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్‌లను ఆదేశించారు. ఆదివారం మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధిపై కార్పొరేటర్‌లు, వివిధ కాలనీలు, బస్తీల అధ్యక్షులతో డివిజన్‌ల వారిగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్పడిన తర్వాత సనత్‌నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.800 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నో ఏండ్లుగా పేరుకుపోయిన అనేక సమస్యలను, టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించినట్టు వెల్లడించారు.

ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. వరద ముంపునకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయం అందకపోతే… మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ఈ విషయాన్ని తెలియజేయాలని కార్పొరేటర్‌లను ఆదేశించారు. అదేవిధంగా ఆస్తిపన్ను చెల్లించే వారికి ప్రభుత్వం 50శాతం రాయితీ కల్పించిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed