సమీక్ష జరిపిన తర్వాతే నైట్ కర్ఫ్యూ విధించాం : మినిస్టర్

by vinod kumar |   ( Updated:2021-04-20 03:20:22.0  )
సమీక్ష జరిపిన తర్వాతే నైట్ కర్ఫ్యూ విధించాం : మినిస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారవి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రాత్రుళ్లు కర్ఫ్యూ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా.. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కోవిడ్ విస్తృతవ్యాప్తిపై సమీక్ష జరిపిన తర్వాతనే ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిందని తెలిపారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి తెలుసు అని విపక్షాలకు చురకలంటించారు. విపక్షాలు చెప్పినట్టు ప్రభుత్వ నిర్ణయాలు ఉండవని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రతిపక్షాలు వింతగా ప్రవర్తిస్తున్నాని విమర్శించారు. అంతేగాకుండా.. వలస కూలీలు ఆందోళనతో సొంతూళ్లకు వెళ్లొద్దని సూచించారు. 30న మళ్లీ సమీక్ష చేసి కర్ఫ్యూపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story