లాక్‎డౌన్‎కు తెరదించిన మంత్రి

by Anukaran |   ( Updated:2020-07-09 06:34:24.0  )
లాక్‎డౌన్‎కు తెరదించిన మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో లాక్ టౌన్ పెడతారని గత పది రోజులుగా వైరల్ అవుతున్న వార్తకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెరదించారు. కరోనా వైరస్ కట్టడికి ప్రజలు తీసుకునే జాగ్రత్తలే ముఖ్యమని, దీనిపై మళ్లీ లాక్ డౌన్ అనవసరమని ఆయన తెలిపారు. దీనికి ఉదాహారణ హోంమంత్రి మహమూత్ అలీ, పద్మారావు, వి.హన్మంతరావాని ఆని ఆయన చెప్పారు. కరోనా వస్తోంది, పోతుందని దాని గురించి ఎవరు భయపడోద్దని, అలాగే అజాగ్రత్తగా ఉండోద్దని సూచించారు.

ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. సీఎం కనిపించకపోతే వారికి వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. పాలన నడుస్తుందా లేదా అని చూడాలని, ప్రతిదాన్ని రాజకీయం చేయవద్దని హితువు పలికారు. ఎన్నికల మేనిపోస్ట్ లో పెట్టిన అంశాలపై కూడా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులకు చేతనైతే దేశంలో హెల్తా ఎమర్జెన్నీ పెట్టియాలని హితువుపలికారు. బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో, ఢిల్లీలో కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో ఆ పార్టీ నాయకులు తెలిపాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed