- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూనాని ఆస్పత్రిలో 300 మందికి చికిత్స
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దిశ, హైదరాబాద్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అమల్లో ఉన్న లాక్ డౌన్‌కు ఇంకొంత కాలం సహకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని చార్మినార్ యూనానీ ఆస్పత్రిలో 300 మందికి చికిత్స చేసే అవకాశం ఉందన్నారు. పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, యునాని శాఖల అధికారులతో శనివారం యూనాని ఆస్పత్రిలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ,కరోనా నియంత్రణకు అన్ని శాఖల అధికారులు క్రమం తప్పకుండా మానిటరింగ్ చేస్తున్నారని అభినందించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ, కరోనా వైరస్ ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మనందరికీ తెలుసన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సహకారం అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూనానీ, విద్యుత్, వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ,కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. రేషన్ కార్డు ఉన్నవారికే మాత్రమే రేషన్ అందుతుందనీ, లేని వారికి కూడా రేషన్ అందజేయాలన్నారు. ఆస్పత్రులలో ఔట్ పేషెంట్లను కూడా చూసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, వాటర్ బోర్డు అధికారి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
Tags: Review Meeting, Unani Hospital, Charminar, Minister Talasani, covid 19 effect