- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Srinivas Goud : మీ సాయం మరువలేనిది.. మెగాస్టార్‌పై మినిస్టర్ ప్రశంసలు
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా విస్తరిస్తున్న విపత్కర సమయంలో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు రావడం అభినందనీయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అనాథాశ్రమంలో చిరంజీవి అభిమానులు మొదటి విడతగా తీసుకొచ్చిన పది ఆక్సిజన్ సిలిండర్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినీ రంగంలో మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి, బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు నిలిపారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సిలిండర్‌లను అందజేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మరో నలభై సిలిండర్లను చిరంజీవి త్వరలోనే జిల్లాకు పంపనున్నారు అని మంత్రి చెప్పారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దాతలు ముందుకు రావడానికి ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
సమస్యలన్నింటినీ అధిగమించి మహబూబ్‌నగర్‌లో హైదరాబాద్ కార్పోరేట్ ఆస్పత్రులకు దీటుగా, తక్కువ బిల్లులతో వైద్యం అందిస్తున్నారన్నారు. అనంతరం ఆయన జిల్లా ఆస్పత్రికి చేరుకొని కువైట్ పరీక్షలు జరుగుతున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే పరీక్షలు చేయడానికి సిబ్బంది చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ నర్సింలు, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోనివెంకటయ్య, రెడ్ క్రాస్ చైర్మన్ ప్లైన్ నటరాజ్, కోశాధికారి జగపతిరావు, డాక్టర్ శామ్యూల్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బెక్కెం జనార్ధన్, నాయకులు జూపల్లి భాస్కర్ రావు, మల్లె పోగు శ్రీనివాస్, చిరంజీవి అభిమాన సంఘం నేతలు జమ్మన్న, ఎండి అష్రాఫ్, పీఆర్‌రఘు, బన్నీ కృష్ణ, సిరి చూసి న్యూస్, శివ, కళ్యాణ్, హుస్సేన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.