హలం పట్టి.. పొలం దున్ని..

by Shyam |   ( Updated:2020-06-04 08:59:06.0  )
హలం పట్టి.. పొలం దున్ని..
X

దిశ, మహబూబ్ నగర్: వానాకాలం సమీపిస్తుండటంతో ఇప్పటికే రైతులు భూములు చదును చేస్తున్నారు. గురువారం నారాయణ పేట జిల్లా మద్దూర్ మండలంలో పర్యటించిన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుగు ప్రయాణంలో కొందరు రైతులు భూమిని చేసి, విత్తనాలు నాటుతుండటం చూసిన ఆయన తన వాహనాన్ని ఆపి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కాసేపు ముచ్చటించి నాగలి పట్టి పొలం దున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతు కళ్లల్లో ఆనందం చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని చెప్పారు.కొద్దిసేపు నాగలి పట్టిన మంత్రి తన ఆనందాన్ని రైతులతో పంచుకున్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుతున్నాయా లేదా రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన, ఇతర ప్రజా ప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు.

Advertisement

Next Story