1000 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెస్సింగ్ సెజ్

by Shyam |
1000 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెస్సింగ్ సెజ్
X

దిశ, మహబూబ్ నగర్ :
మహబూబ్ నగర్ జిల్లాలో 1000 ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అంందుకోసం మహబూబ్ నగర్- హన్వాడ మధ్య గల ఫారెస్ట్-రెవెన్యూ వివాదంలో ఉన్న భూమిని సెజ్ కోసం కేటాయింపు చేసేందుకు త్వరలోనే సర్వే పూర్తి చేస్తామన్నారు.శుక్రవారం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ..ఈ సెజ్ ఏర్పాటు వలన రైతులు పండించే పంటలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కలుగుతుందని వివరించారు. రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, నియంత్రణ పంట విధానంలో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. జిల్లాను 76 క్లస్టర్లుగా ఏర్పాటు చేశామని, ప్రతి క్లస్టర్‌లో ఒక భవనం నిర్మించి, అందులో నుంచి పర్యవేక్షణ చేస్తామన్నారు. అధికారులు ప్రణాళిక తయారీ, పంటసాగు విధానం, విత్తన పంపిణీ, ధాన్యం కొనుగోలు దీని నుంచే జరుగుతుందన్నారు.అలాగే కల్తీ విత్తనాలు రైతులకు అంటగడితే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా జైలుకు పంపుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. భూత్పూరు కేంద్రంగా కల్తీ విత్తనాల మాఫియా చెలరేగి పోతున్నదని, వీరిపై పీడీ యాక్ట్ పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదేవిధంగా గద్వాల జిల్లాలో నకిలీ సీడ్ మాఫియాపై కఠిన చర్యలు తీకుంటామని స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed