మహబూబ్‌నగర్‌కు వచ్చే వలస కూలీలపై దృష్టి: శ్రీనివాస్‌గౌడ్

by Shyam |   ( Updated:2020-05-04 08:58:36.0  )
మహబూబ్‌నగర్‌కు వచ్చే వలస కూలీలపై దృష్టి: శ్రీనివాస్‌గౌడ్
X

దిశ, మహబూబ్‎నగర్: కేంద్ర ప్రభుత్వం లాక్‎డౌన్ సడలించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉండే వలస కూలీలు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాబట్టి జిల్లాకు వచ్చే ప్రతి ఒక్కరూ 14 రోజులు ఇంట్లోనే ఉండాలని ఆయన కోరారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సోమవారం వివిధ అంశాలపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గడిచిన 27 రోజుల నుంచి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. టెక్నికల్‎గా మహబూబ్‌నగర్ గ్రీన్‌జోన్‌లో ఉందని, ఇందుకోసం ఎంతో శ్రమించిన జిల్లా యంత్రాంగానికి ఆయన అభినందనలు తెలిపారు. వలస వచ్చే వారికి సంబంధించి వివరాలను జిల్లా యంత్రాంగం కూడా సేకరిస్తుందన్నారు. ఇందుకోసం ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే, మహబూబ్‎నగర్ జిల్లాలో ఉన్న కంటైన్‌మెంట్ జోన్‎లను ఎత్తివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

tag: Minister Srinivas Goud, Review, Migrant Workers, Mahabubnagar

Advertisement

Next Story

Most Viewed