సీఎస్​తో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ భేటీ

by Shyam |
సీఎస్​తో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ బీఆర్‌కే భవన్​లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను కలిశారు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈనెల 31వరకు పదోన్నతులు కల్పించే అంశంపై మంత్రి.. సీఎస్‌తో చర్చించారు. సర్వీస్‌ మూడేండ్ల నుంచి రెండేళ్ల తగ్గించి పదోన్నతులు కల్పించే విషయంపై చర్చించారు. త్వరలో అర్హులైన ఉద్యోగులందరికీ ఉద్యోగోన్నతి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరారు. మంత్రి విజ్ఞప్తిపై సీఎస్​ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Advertisement

Next Story