- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వేద పాఠశాల కోసం కొత్త బిల్డింగ్ నిర్మాణం
దిశ, మహబూబ్ నగర్ :
జిల్లాలోని ఏనుగొండ వద్దనున్న దేవుని గుట్టపై వేద పాఠశాల కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రెండు వేల చదరపు గజాల స్థలంలో రూ.5 లక్షల చేపట్టిన పనులకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మహబూబ్ నగర్‌లో వేద పాఠశాల లేనందున బ్రాహ్మణ విద్యార్థులు వేదం నేర్చుకోలేక పోతున్నారని వివరించారు.ఈ క్రమంలోనే దేవునిగుట్టపై వేదపాఠశాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులకు వేదాలు నేర్పించి పండితులను తయారు చేయాలని ఆశిస్తున్నట్లు మంత్రి కోరారు. కరోనా కారణంగా ఆలయాలు మూసివేసి ఉండటంతో పేద బ్రాహ్మణులు ఇబ్బందులు పడకుండా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కెసీ నర్సిములు, ఐదో వార్డు కౌన్సిలర్ వనజ, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.