- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాడుబడ్డ సచివాలయంలో ఎలా సంసారం చేయాలి !
దిశ, న్యూస్‌బ్యూరో: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధిని పక్క రాష్ట్రాలు హర్షిస్తుంటే ఇక్కడ పుట్టి పెరిగిన కాంగ్రెస్, బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కొత్త సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రతిపక్ష నేతలు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడుబడ్డ పాత సచివాలయంలో ఎలా సంసారం చేయాలని ప్రతిపక్షాలను విమర్శించారు. సచివాలయ నిర్మాణంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనడం అజ్ఞానమన్నారు. కొత్త సచివాలయం ఓ ప్రతికగా మారబోతుందని, వందేళ్ల పాటు పాలన అవసరాలను తీర్చబోతుందన్నారు. బుధవారం అసెంబ్లీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ఎక్కడుంటే ఏంటని.. ఏ పథకమైనా ఆగిందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఎవరైనా సెక్షన్ 8పై మాటేత్తితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఉత్తమ్ ఏనాడూ తెలంగాణ కోసం పోరాటం చేయలేదని, ఆయన నైజం సెక్షన్ 8పై మాట్లాడటంతో తేట తెల్లమైయిదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల వల్లే రాష్ట్రం 7మండలాలు కోల్పోయిందన్నారు. తెలంగాణపై ఢిల్లీ పార్టీల పెత్తనం నడవదని హెచ్చరించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రా వ్యక్తా ? తెలంగాణ శత్రువులతో జత కలిశారా అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ గడ్డ మీద నుంచే పాలన సాగిస్తున్నారని, సీఎం వ్యవసాయ క్షేత్రం ఎమైనా అమరావతిలో ఉందా అని ప్రశ్నించారు.