‘గత సహకార సంఘాల్లో పెద్ద ఎత్తున అవినీతి’

by Shyam |
‘గత సహకార సంఘాల్లో పెద్ద ఎత్తున అవినీతి’
X

దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో చిరువ్యాపారస్తులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత సహకార సంఘాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎవరికీ రుణాలు ఇవ్వకుండా అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. అవినీతికి పాల్పడిన వాళ్లపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. డైలీ ఫైనాన్స్ పేరు మీద రూ.10 వడ్డీ వసూలు చేస్తోన్న జలగల వివరాల్ని పోలీసు శాఖచే సేకరిస్తామన్నారు. చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు సంఘాల కార్యాలయాల్లో బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లను తెరవాలని సూచించారు. అలాగే రుణాలు తీసుకున్న వాళ్ళు సకాలంలో చెల్లింపులు చేయాలని పేర్కొన్నారు. శనివారం కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుపై చర్చించారని, రాజకీయలకు అతీతంగా సాయం కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed