- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముంపు గ్రామాల ప్రజలను ఆదుకుంటాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
by Shyam |
X
దిశ, మహబూబ్‌నగర్: ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉదండాపూర్, వల్లూరు గ్రామ ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిర్మించనున్న పునరావాస కేంద్రానికి ఎంపిక చేసిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు ఇతర జిల్లాలు కూడా సస్యశ్యామలం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తక్షణమే సహాయం అందిస్తోందన్నారు. ముంపు బాధితులకు వంద శాతం న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, కలెక్టర్ ఎస్.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story