- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం’
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచి కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి మీ శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాంతా నారాయణ గౌడ్(ఎస్ ఎన్ జి) చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీహిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను లేచారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో జర్నలిస్టుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఎటువంటి కష్టాలు వచ్చినా ఆదుకుంటుందని చెప్పారు.
మహబూబ్ నగర్ జిల్లా జర్నలిస్టులకు ఎటువంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చిన తాము అండగా నిలుస్తామని మంత్రి చెప్పారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలు, అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలను గురించి రాసే క్రమంలో నిజానిజాలను గుర్తించి వార్తలు వ్రాయాలని చేశారు. జర్నలిస్టులు నా కుటుంబ సభ్యులు లాంటి వారు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటా.. ఎటువంటి కష్టం వచ్చినా సంప్రదించండి తప్పకుండా అండగా నిలుస్తానని మంత్రి చెప్పారు. మూడో విడత కరోనా విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఎస్ ఎన్ జి చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ శ్రీహిత మాట్లాడుతూ తన తాతగారైన నారాయణ గౌడ్, నానమ్మ శాంతమ్మ పేరు మీద ఏర్పాటు చేసిన ఈ ట్రస్టు ద్వారా కరోనా బాధిత కుటుంబాలకు, జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందేందుకు వచ్చినవారికి, అభాగ్యులకు గత 18 రోజుల నుండి అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇదే స్ఫూర్తిని కొనసాగించి తమ సంస్థ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు, వైస్ చైర్మన్ గణేష్, టిఆర్ఎస్వి రాష్ట్ర నేత సుదీప్ రెడ్డి ఆయా వార్డుల కౌన్సిలర్లు, జర్నలిస్టులు పాల్గొన్నారు.