మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సంలో మంత్రి హంగామా..!

by Shyam |
మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సంలో మంత్రి హంగామా..!
X

దిశ, మహబూబ్‌నగర్ : ప్రజలు ఎవ్వ రూ అనవసరంగా రోడ్లపైకి రావొద్దు.. గుంపులుగా తిరగొద్దు.. సోషల్ డిస్టెన్స్ పాటించండి.. మీకు దండం పెడతాం.. ఒక వేళ చెప్పిన మాట వినకపోతే లాఠీలకు పని చెప్పాల్సి వస్తుంది. ఈ వ్యాఖ్యలు బుధవారం నాడు స్వయంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజలను ఉద్దెశించి అన్నారు. అయితే సరిగా 24 గంటలకు గడవక ముందే అదే మంత్రి నిబంధనలను తుంగలో తొక్కుతూ పదుల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అధికారులను వెంట వేసుకుని జిల్లా కేంద్రంలో పర్యటించడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రధాని నుంచి సీఎం వరకు అందరు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని సూచిస్తుంటే మన మంత్రి మాత్రం అందుకు పూర్తిగా విరుద్దంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. రైతు బజార్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా మరింత విమర్శలకు తావిచ్చింది. ఇలాంటి సమయాల్లో కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రి ఇలా హంగు ఆర్బాటాలకు ప్రాముఖ్యత ఇవ్వడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గురువారం పట్టణంలోని అబ్దుల్
ఖాదర్ దర్గా వద్ద కొత్తగా నిర్మించిన మాడ్రన్ మార్కెట్ యార్డ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: minister, srinivas goud, market yard, mahabubnagar

Advertisement

Next Story

Most Viewed