- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తెలంగాణలో మరో 30 ఏండ్లు కరెంట్ కష్టాలు ఉండవ్..’
దిశ, వనపర్తి: తెలంగాణ రాష్ట్రంలో రానున్న 30 ఏళ్ల వరకు వ్యవసాయ రంగానికి కరెంట్ కష్టాలు ఉండవని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి నియోజకవర్గంలోని గోపాల్‌పేట, రేవల్లి మండలాల్లోని ఏదుట్ల, తలపనూరు గ్రామాలలో 33/11 సబ్‌స్టేషన్ పనులకు, శంకుస్థాపన, సకలపల్లి గ్రామంలో రూ. కోటి 80 లక్షలతో నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్‌ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వనపర్తి నియోజకవర్గ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి మూడు/నాలుగు గ్రామాలకు ఒక సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తద్వారా రైతులకు లో వోల్టేజ్‌తో మోటర్లు కాలిపోవడం వంటి సమస్యలు ఉండబోవని శుభవార్త చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ భార్గవి, ఎంపీపీ సంధ్య, విద్యుత్ శాఖ ఎస్‌ఈ, డీఈ, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.