- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విదేశాల్లోనూ నోరూరించనున్న మానుకోట మామిడి
దిశ, వరంగల్: మానుకోట మామిడి దశ మారనుంది. ఎంతో ప్రత్యేకమైన ఈ మామిడి పండ్లు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రత్యేకత చాటబోతుంది. ఈ మామిడిపండ్ల రుచి త్వరలో ఇతర దేశాల ప్రజలను కూడా నోరూరించనుంది. రసాయనాలతో కాకుండా సేంద్రియ ఎరువులతో పండించే ఈ పంట దేశానికే ఆదర్శం కానుంది. ఈ మేరకు వీటి ప్రత్యేకతను చాటడానికి సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీపార్క్ వద్ద మానుకోట మామిడి పండ్ల ప్రదర్శనను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రసాయనాలు లేకుండా సేంద్రియ పద్దతిలో పండిస్తున్న మానుకోట మామిడిపండ్లు రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని, వీటిని దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసేందుకు కృషి చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆరోగ్యకరమైన ఈ మామిడి పండ్లను మహబూబాబాద్ కేంద్రంగా అందరికీ అందించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన రైతులు కూడా ఈ విధంగా పండించేందుకు ముందుకు రావాలన్నారు. ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా, నాణ్యమైన పంట పండించేలా మీరు పాటించే మెళకువలు మిగిలిన రైతులకు కూడా తెలియజేయాలన్నారు. రైతులందరూ సంతోషంగా ఉండాలని, రైతులు మార్కెట్ విలువ కలిగిన పంటలు వేయాలని తెలిపారు. రైతు బిడ్డలుగా ప్రతిఒక్కరూ సీఎం కేసీఆర్ సూచించే సలహాలు పాటిస్తూ వ్యవసాయాన్ని పండగ చేయాలన్నారు.