టెన్త్ పరీక్షలకు పకడ్బందీ చర్యలు: మంత్రి సత్యవతి

by Shyam |
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ చర్యలు: మంత్రి సత్యవతి
X

దిశ, న్యూస్‌బ్యూరో: జూన్ 8 నుంచి జరగబోయే టెన్త్ పరీక్షలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. శనివారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో టెన్త్ పరీక్షల నిర్వహణ- కరోనా వైరస్ కట్టడి చర్యలపై మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులు వారం ముందే వసతి గృహాలకు చేరుకునేలా కార్యాచరణ రూపొందించి అందరికీ థర్మల్ స్ర్కీనింగ్ చేయాలన్నారు. విద్యార్థులకు రోగ నిరోధకత పెంచే పోషకహారాన్ని అందించాలని సూచించారు. అధికారులు, టీచర్లు విద్యార్థులను పరీక్షా కేంద్రాల వద్దకు వాహనాల్లో తీసుకెళ్లాలన్నారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దన్నారు. గిరిజన శాఖ విద్యాలయాల్లో 2,949 మంది విద్యార్థులున్నారని, అన్ని జిల్లాలో వీరికోసం 38 కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed