- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం
దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కందూకుర్ మండలం సాయిరెడ్డి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్మాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ అనితా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ చెంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్ మండలం మంగళపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ఓ జనార్దన్‌రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ వెంకటేష్ గుప్తా, డైరెక్టర్లు పాల్గొన్నారు.
Tags : lockdown, rice purchasing centers, minister samitha opening, rangarredy