- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
దిశ, ఏపీ బ్యూరో: పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. సీఎస్ నేతృత్వంలోని కమిటీ సోమవారం సీఎం వైఎస్ జగన్‌కు పీఆర్సీ నివేదిక సమర్పించగా… మంగళవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉద్యోగ సంఘాల నేతల్లో ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలోని కమిటీ పీఆర్సీ నివేదికను సోమవారం సీఎం వైఎస్ జగన్‌కు అందజేసింది. అయితే పీఆర్సీ అమలుకు సంబంధించి 11 సూచనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎస్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
దీంతో మంగళవారం ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలతో విడివిడిగా సమావేశమై చర్చించారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్ అంశంతోపాటు మెుత్తం ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన 71 డిమాండ్లపై చర్చించారు. అలాగే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సైతం ఉద్యోగ సంఘాల నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.
సమావేశం అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతి అని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో ఉందన్నారు. తమకు ఇంత కావాలని ఉద్యోగులు చెప్పడంలో తప్పు లేదని చెప్పుకొచ్చారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని చెప్పుకొచ్చారు.