హెచ్ఎండీఏ అధికారులపై మంత్రి సబిత సీరియస్

by Anukaran |   ( Updated:2020-08-15 04:28:07.0  )
హెచ్ఎండీఏ అధికారులపై మంత్రి సబిత సీరియస్
X

దిశ, మహేశ్వరం: గత మూడు రోజుల నుంచి వర్షం పడడంతో మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్ ఎల్ ఆర్ కాలనీ, మిధుల నగర్ కాలానీలో వరద నీరు వచ్చి చేరింది. శనివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వరద నీటిని పరిశీలించి మీర్ పేట్ కార్పోరేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి… హెచ్ఎండీఏ అధికారాలు ఈ ప్రాంతాల్లో పర్యటించి వెంటనే తాత్కాలికంగా ట్రంక్ లైన్ కనెక్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. స్థానిక కాలనీ వాసులతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పనులు ఆలస్యం అయ్యాయని, లేకపోతే ఇప్పటికే ట్రంక్ లైన్ పనులు పూర్తి అయ్యేదని చెప్పారు. మురుగునీటిలో చేరిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులకు సూచించారు. వరద నీటిని పరిశీలించిన వారిలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కమిషనర్ సుమన్ రావు, స్థానిక కార్పొరేటర్లు ఉన్నారు.

Advertisement

Next Story