నిరుద్యోగులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుడ్‌న్యూస్..

by Harish |
నిరుద్యోగులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుడ్‌న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల జాతరకు త్వరలోనే ముహుర్తం ఖరారు కానుందని తెలుస్తోంది. అందుకు సంబంధించి వివరాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ సాక్షిగా బుధవారం ప్రకటించారు. ఇప్పటికే TET అర్హత పరీక్షను నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం, DSC కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది.

పాతపద్ధతి ప్రకారమే ఈసారి డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఇదిలాఉండగా, రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందా అని నిరుద్యోగులు గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తు్న్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story