గాయపడిన వారిని ఆదుకుంటాం: సబితా ఇంద్రారెడ్డి

by Shyam |
గాయపడిన వారిని ఆదుకుంటాం: సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, రంగారెడ్డి: కోహెడలో నూతనంగా ప్రారంభించిన పండ్ల మార్కెట్‌లోని పలు షెడ్లు సోమవారం రాత్రి వీచిన గాలివాన భీభత్సానికి కూలిపోగా, వాటి కింద ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్కెట్ పునర్నిర్మాణంపై కూడా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యాపారస్థులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Tags : Minister Sabitha Indra Reddy, visited, Koheda, Fruit Market, rangareddy

Advertisement

Next Story