- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దూరం దూరంగా ఉండాల్సిందే: సబితా
దిశ, రంగారెడ్డి: కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రజాప్రతినిధులు కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీస్, వైద్యశాఖ అధికారుల పనితీరుతోనే జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. ఇదే పద్ధతిని కొనసాగిస్తే వైరస్‌ను నిర్మూలించవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని.. ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.