- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ బ్రేకింగ్ : ఆన్‌లైన్ క్లాసులు బంద్.. విద్యాశాఖ కీలక ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పాఠశాలలు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యాశాఖ ప్రైవేటు స్కూల్, కాలేజ్ యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల నుంచి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని, అదనపు ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు.
ఫీజుల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి తెస్తే ప్రభుత్వ జీవోను ఉల్లంఘించినట్టే పరగణిస్తామని.. ఆ తర్వాత చర్యలకు ఆదేశాలిస్తామన్నారు. తొలుత 8 నుంచి 12వ తరగతి వరకు మాత్రమే ఫిజికల్ క్లాసులు ఉంటాయని చెప్పిన విద్యాశాఖ.. తాజాగా ఒకటవ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులందరికీ ఫిజికల్ తరగతులు నిర్వహించనున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అంగన్ వాడీ సెంటర్లు కూడా ఓపెన్ చేయనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. కరోనా తీవ్రత తక్కువగా ఉన్నందున ఆన్‌లైన్ మొత్తంగా బంద్ చేసి విద్యార్థులందరికీ పాఠశాలల్లో ఫిజికల్ తరగతులు నిర్వహించనున్నట్టు స్పష్టంచేశారు.