వద్దు.. ఆ ప్రయత్నం చేయకండి.. ప్రజలను అప్రమత్తం చేసిన మంత్రి

by Shyam |   ( Updated:2021-08-29 12:33:25.0  )
sabitha-indra-reddy 1
X

దిశ, వికారాబాద్: వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలను అప్రమత్తం చేశారు. ఆదివారం భారీ వర్షాల వల్ల వికారాబాద్ జిల్లాతో పాటు, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని పలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఎలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పౌసుమి బసును, ఎస్పీ నారాయణను మంత్రి ఆదేశించారు. మర్పల్లి వాగులో గల్లంతైన వారి ఆచూకి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. నవాబుపేట్ మండలం ఫుల్ మామిడిలో జరిగిన ఘటనతో పాటు, శంకర్ పల్లి మండలం కొత్తపల్లి వాగు, మర్పల్లి మండలం సిరిపురం వద్ద చోటు చేసుకున్న సంఘటనల పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీలు వాగుల వద్ద గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. మరింత ముఖ్యంగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed