ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తాం: సబిత

by Shyam |
ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తాం: సబిత
X

దిశ, రంగారెడ్డి: జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్​ జిల్లా బోంరాస్​పేట్​ మండలం తుంకిమెట్ల గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలో మొట్ట మొదటి రైతు వేదిక భవనం తుంకిమెట్లలో నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు రైతు వేదిక భవనాలు ఉపయోగపడుతాయన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతులు ఎదిగాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో కంది పంట పండించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌తో సాగు నీరు అందిస్తామన్నారు. రైతు చనిపోతే 10 రోజుల్లో రూ. 5 లక్షలు రైతు కుటుంబానికి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story