విద్యుత్ అధికారులపై మంత్రి సబిత ఆగ్రహం

by Shyam |
విద్యుత్ అధికారులపై మంత్రి సబిత ఆగ్రహం
X

దిశ, మహేశ్వరం: మునిసిపాలిటీల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తుక్కుగూడ మున్సిపాలిటి చైర్మన్ మధుమోహన్ అధ్యక్షతన జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ప్రభుత్వం ప్రతి నెల పట్టణ ప్రగతిలో భాగంగా రూ. 148 కోట్ల నిధులు విడుదల చేస్తుందన్నారు. తుక్కుగూడ మునిసిపాలిటీకి 26 లక్షలు ప్రతినెల వస్తున్నాయన్ని, ఇప్పటి వరకు 4 కోట్లపై చిలుకు నిధులు వచ్చాయన్నారు. మునిసిపాలిటీలో 6 ట్రాన్స్ ఫార్మన్లను మంజూరు చేస్తున్నట్లు, నూతన పోల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మొదటి విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు తెలిపిన విద్యుత్ సమస్యలను పరిష్కరించకపోవటం పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు ఆదేశించారు. స్వచ్ఛ మునిసిపాలిటీగా తుక్కుగూడను తీర్చిద్దేందుకు అందరూ ముందుకు రావాలన్నారు.

Advertisement

Next Story