- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సబితా
దిశ, జల్‌పల్లి: మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణలో ఒమిక్రాన్కేసులు పెరుగుతున్న దృష్ట్యా బాలాపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, కోవిడ్ టెస్టుల ప్రక్రియను మెడికల్ ఆఫీసర్ అడిగి తెలుసుకున్నారు.
ప్రజల కోసం నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. జనవరి 10 తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లు అందరూ కూడా బూస్టర్ డోస్ వేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గ దీపు లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కామేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.