- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి ఇంటికీ ‘భగీరథ’ నీరు : మంత్రి అల్లోల
దిశ, ఆదిలాబాద్: రాష్ర్టంలోని ప్రతిఇంటికీ మిషన్ భగీరథ నీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో లిఫ్ట్ ఇరిగేషన్, అటవీ, విద్యుత్, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, ఐటీడీఏ అధికారులతో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో ఎక్కడ కూడా పైపులు లీకేజ్ కాకుండా మరమ్మతులు చేపట్టాలన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ విద్యుత్తును సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈని ఆదేశించారు. పంచాయతీ ట్రాక్టర్లు ఇంటింటికీ చెత్త సేకరణకు వెళ్ళినప్పుడు ట్రాక్టర్లకు మైక్ సిస్టం ఏర్పాటు చేసి దాని ద్వారా చెత్త సేకరణకు ట్రాక్టర్ వస్తుందని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ.. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు 396 ట్రాక్టర్లు, 218 ట్రాలీలు,104 ట్యాంకర్లను కొనుగోలు చేశామని, నెలాఖరులోగా మొత్తం ట్రాలీలను కొనుగోలు చేస్తామన్నారు. సాగునీటి కాలువలు, ఉప కాలువలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, చెత్తను ఉపాధిహామీ కూలీలతో తొలగించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్, జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, జెడ్పీ చైర్పర్సన్ కోరుపల్లి విజయలక్ష్మి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్ మిశ్రా, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.