- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ సేవలు వెలకట్టలేనివి : ఈటల
దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వైద్యులు, ఆశా కార్యకర్తలు విస్తృత సేవలు అందించారని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. గురువారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల డీఎంఅండ్ హెచ్‌ఓలు, ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారులు, సూపర్‌వైజర్‌లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని, ఇందుకు కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని అభినందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, జిల్లా సర్వలెన్స్ అధికారి డాక్టర్ కార్తీక్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అవినాష్, ఆశిష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనా కట్టడి కోసం విస్తృతంగా కృషి చేసిన వైద్య సిబ్బంది ఆరోగ్య శాఖ ద్వారా అమలు చేస్తున్న ఇతర సేవా కార్యక్రమాలను కూడా కొనసాగించాలని సూచించారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక టీకాలు, గర్భిణీలకు సేవలు, ప్రసూతి కార్యక్రమాల విషయంలో అలర్ట్‌గా ఉండాలని సూచించారు. అంటు వ్యాధులు, బీపీ, షుగర్, వృద్ధుల సేవల విషయంలో సమిష్టిగా పని చేయాలని కోరారు. జిల్లా వైద్యాధికారులు ఎప్పటికప్పుడూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శాంతి కుమారి, కమిషనర్ యోగిత రానా, డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.