ఖరీఫ్‌కు సరిపడా నీరందిస్తాం..

by Sridhar Babu |   ( Updated:2020-08-09 06:23:29.0  )
ఖరీఫ్‌కు సరిపడా నీరందిస్తాం..
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: సాగర్ ఆయకట్టు కింద సాగవుతున్న పంటలకు ఖరీఫ్‌కు సరిపడా నీరందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు కింద సాగ‌వుతున్న పంటలకు నీటి పంపిణీపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఖరీఫ్‌కు సరిపడు సాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద ఉన్న ప్రతి ఎకారాకు సాగునీటిని అందేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Advertisement

Next Story