- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు పునరుద్ధరించండి: మంత్రి వేముల
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్దరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రోడ్లు పాడైపోవడంతో రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షానికి దెబ్బతిన్నరోడ్లు, వంతెనల వివరాలు అంచనా వేసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. పర్మినెంట్‌గా వాటిని పునరుద్దరించడం కోసం ఎంత ఖర్చవుతుందో అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రజా రవాణాకు ఇబ్బందులు రానివ్వకూడదన్నారు. అధికారులు 24గంటలు తమ హెడ్‌క్వార్టర్స్‌లో కచ్చితంగా అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఆర్‌అండ్‌బీ అధికారులు పనిచేయాలని అన్నారు. సమీక్షా సమావేశంలో ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, ఈఎన్‌సీ గణపతి రెడ్డి, రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.