స్పైసెస్ బోర్డు పేరిట నాటకాలు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

by Shyam |
స్పైసెస్ బోర్డు పేరిట నాటకాలు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
X

స్పైసెస్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుతో నిజామాబాద్ రైతులకు ఒరిగేదేమీ లేదని, పసుపు కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసినప్పుడే మేలు జరుగుతుందని రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో 30 ఏండ్లుగా, వరంగల్‌లో 20 ఏండ్లుగా స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నా.. ఏనాడూ పసుపు రైతులకు మద్దతు ధర లభించలేదని గుర్తు చేశారు. అలాంటి కార్యాలయాలు దేశంలో 16 చోట్ల ఉన్నాయన్నారు. భీమ్‌గల్‌లో బుధవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. దశాబ్దాలుగా రైతులు కోరుతున్నది పసుపు బోర్డు మాత్రమేనని గుర్తు చేశారు. రైతుల డిమాండు మేరకు కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసి, దాని ద్వారా రూ. 15 వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండు చేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత వారం రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని అరవింద్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఏడాది కావొస్తున్నా ఇప్పటివరకు పసుపుబోర్డు ఏర్పాటు కాలేదన్నారు. పసుపు బోర్డు సాధనలో విఫలమైన ఎంపీ అరవింద్ స్పైసెస్ బోర్డు పేరిట నాటకాలాడుతున్నారన్నారు. అంతకుముందు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్‌గల్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు రూ. 8.67 కోట్ల చెక్కులను అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed