తొలి ఏసీ రైల్వే టర్మినల్ రెడీ : పీయూష్ గోయల్

by Shamantha N |
AC terminal
X

న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్టుల మాదిరిగా దేశంలో తొలిసారిగా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండీషన్డ్ రైల్వే టర్మినల్‌ కొద్దిరోజుల్లోనే ప్రారంభం కానుంది. బెంగళూరులో నిర్మించిన దీనిని త్వరలోనే వినియోగంలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. బెంగళూరుకు సమీపంలోని బయ్యప్పన్‌హళ్లిలో నిర్మించిన దీనికి భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరును పెట్టారు. గత నెలలోనే ఈ టర్మినల్‌ను ప్రారంభించాల్సి ఉండగా పలు కారణాల రీత్యా అది వాయిదా పడింది. రూ.314 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టర్మినల్‌లో ఏడు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. ఈ టర్మినల్‌తో బెంగళూరు, యశ్వంతపూర రైల్వే స్టేషన్‌లపై పడుతున్న భారం తగ్గనున్నదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రోజుకు 50 వేల మంది రాకపోకలు సాగించే విధంగా దీనిని నిర్మించారు. బెంగళూరు నుంచి చెన్నై, హైదరాబాద్, ముంబయి వంటి మెట్రో సిటీలకే గాక రాష్ట్రంలోని జిల్లాలకు కూడా ఈ టర్మినల్ నుంచి రోజుకు 50 దాకా ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడవనున్నాయని రైల్వే అధికారులు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed