కేఏ పాల్ కూడా సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారు

by srinivas |
minister Perni Nani
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఇంతవరకూ స్పెషల్ స్టేటస్ ప్రకటించని బీజేపీ ప్రభుత్వం, పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. బీజేపీ పచ్చి మోసకారి ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుదుచ్చేరికి హోదా ఇస్తామని నిర్మలాసీతారామన్ ప్రకటించింది.. ఏపీ ఇవ్వలేని హోదా పుదుచ్చేరికి ఎలా ఇస్తారో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రౌడీయిజం ఎలా చెబుతుందో మమతా చెబుతున్నారని గుర్తుచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంలో ఎలాంటి విశేషం లేదని అన్నారు. కేఏ పాల్ సైతం తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో సీఎం జగన్ ఎలాంటి టార్గెట్లు ఇవ్వలేదు అని స్పష్టం చేశారు. అంతేగాకుండా.. జెడ్పీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ప్రజలు ఓట్లు వేయరు అని వెల్లడించారు.

Advertisement

Next Story