- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంపై తెలంగాణ మంత్రితో చర్చిస్తాం: పేర్ని నాని
by srinivas |
X
దిశ, న్యూస్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై త్వరలో తెలంగాణ రవాణాశాఖ మంత్రితో చర్చలు జరుపుతామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చిన కేసులో అరెస్టయిన అనంతపురం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారంపై శనివారం నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా మంత్రి స్పందించారు. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ రవాణా మంత్రిని విజయవాడకు చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. అన్ని కోణాల్లో చర్చించి రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడపడంపై ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఈలోగా అవసరమైతే రెండు రాష్ట్రాల రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులు ఫోన్‌లో ఈ విషయంపై చర్చించి సమావేశ విధివిధానాలను ఖరారు చేస్తారని నాని పేర్కొన్నారు.
Advertisement
Next Story