- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో కూరగాయల సాగు.. ఎన్ని ఎకరాలో తెలుసా?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 2.73 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగుచేస్తున్నామని, 24.99 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందిని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై జరుగుతున్న ప్రసంగాల నేపథ్యంలో శాసనమండలి సభ్యుడు శేరి సుభాశ్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. దేశంలో ఏటా 2.54 కోట్ల ఎకరాల్లో కూరగాయలు సాగుచేస్తున్నారని తెలిపారు. కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ సెకండ్ ప్లేస్‌లో (11.2 శాతం) ఉందన్నారు. చైనా 47 శాతం ఉత్పత్తి చేస్తుంటే, అమెరికా 4 శాతం ఉత్పత్తి చేస్తుందన్నారు. బెండకాయల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్నారు. ఆలు, టమాటా, కాలీఫ్లవర్, ఉల్లి, వంకాయ, క్యాబేజీ ఉత్పత్తిలో సెకండ్ ప్లేస్‌లో ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు 40 రకాల కూరగాయలను వినియోగిస్తుండగా 24 రకాల కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేస్తున్నామన్నామని చెప్పారు.
సీజన్‌లో టమాట 32%, మిర్చి 10%, బెండకాయ 7.4%, వంకాయ 7.3% తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతున్నట్టు తెలిపారు. దేశంలో కూరగాయల ఉత్పత్తిలో తెలంగాణ 15వ స్థానంలో, సాగు విస్తీర్ణంలో 16వ స్థానంలో ఉందని వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచే సీఎం కేసీఆర్ ఆలుగడ్డను పండించి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆలుగడ్డ సాగుకు తెలంగాణ నేలలు అనుకూలమని ఇక్కడ 2 వేల ఎకరాల్లోనే ఆలుగడ్డ సాగవుతుందన్నారు. ఈ బడ్జెట్‌లో రూ.242 కోట్లు ఉద్యానశాఖకు కేటాయించామని, అందులో రూ.50 కోట్లు కూరగాయల పంటలను ప్రోత్సహించేందుకు కేటాయించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి సాంకేతికతను అమలు చేసేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నమన్నారు.